దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి
దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇరాన్ దాడి చేసింది. ఓ ఇంధన ట్యాంక్‌పై డ్రోన్‌తో దాడికి పాల్పడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను నిలిపివేసినట్లు సమాచారం.