'కొమురయ్య పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది'
NLG: జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పేరు తెలంగాణ రైతాంగ పోరాటాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన ఆశయాలను సాధించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.