'వినాయక చవితి నిబంధనలు పాటిస్తూ చేయాలి'

VSP: వినాయక చవితి సంబరాలు సజావుగా నిబంధనలు పాటిస్తూ జరపాలని కంచరపాలెం సీఐ రవికుమార్ అన్నారు. శుక్రవారం కంచరపాలెం స్టేషన్‌లో మాట్లాడుతూ.. మండప నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ట్రాఫిక్ అదుపులో పెట్టాలి, శబ్ద కాలుష్యం నియంత్రణ కీలకం అని హెచ్చరించారు. ఎలాంటి అనవసర అవాంతరాలు రాకుండా ఉత్సవాలు జరపాలని ఆదేశించారు.