సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

PDPL: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. RG-1, 2, 3, 5 ప్రాజెక్టులలో సుమారు 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ప్రాజెక్టుల పని స్థలాలలో పెద్దఎత్తున వరద నీరు చేరింది. దీంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నీటిని తొలగిస్తున్నారు.