కోస్గి రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు
NRPT: కోస్గి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలనొప్పిగా మారకుండా వాహనాలు రోడ్లపై నిలపవద్దని మున్సిపల్ ఛైర్మన్ నాగులపల్లి నరేందర్ హెచ్చరించారు. శనివారం శివాజీ చౌక్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డుపై నిలిపిన వాహనాలను ఆయన స్వయంగా దగ్గరగా చూసి తొలగింపజేశారు. దుకాణాల ముందు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే యజమానులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.