రైతులకు స్టాల్స్ కేటాయింపు
విశాఖ నగరంలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్న 129 మంది రైతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ రైతు కార్డులను మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు రైతుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఈ కార్డులను అందించారు.