స్టేషన్ ఘనపూర్‌లో మినీ జాతర ఏర్పాట్లపై సమీక్ష

స్టేషన్ ఘనపూర్‌లో మినీ జాతర ఏర్పాట్లపై సమీక్ష

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌ పట్టణంలోని రైతు వేదికలో శనివారం సమ్మక్క–సారలమ్మ మినీ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.