రాష్ట్రానికి రానున్న 18 బ్రిటన్‌ స్కూళ్లు

రాష్ట్రానికి రానున్న 18 బ్రిటన్‌ స్కూళ్లు

TG: యూకే (బ్రిటన్‌)కు చెందిన స్కూళ్లు హైదరాబాద్‌ నగరానికి రానున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లను ఫ్యూచర్‌సిటీతోపాటు, ఓఆర్‌ఆర్‌ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు స్కూళ్ల ఏర్పాటుపై హైదరాబాద్‌లో అధికారులు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయా స్కూళ్లకు అనుమతులిచ్చే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.