NSUI రాష్ట్ర అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం

HYD: ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓడిశాలోని భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థినీ(19)పై ఆ రాష్ట్ర NSUI రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రదాన్ అత్యాచారం చేసి ఈరోజు పోలీసులకు పట్టుబడ్డాడని ABVP నేతలు తెలిపారు. దానికి నిరసనగా ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ABVP సంఘం నాయకులు రాంబాబు, జీవన్, పృథ్వి, పలువురు పాల్గొన్నారు.