అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి

అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి

JGL: సారంగాపూర్ మండలం రేచపల్లిలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ, గీత కార్మికులకు సామాజిక భద్రతా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సర్పంచ్ బాస మహేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లు 28, వితంతు 25, దివ్యాంగుల 6, బీడీ కార్మికుల 90, గీత కార్మికుల పెన్షన్లు మంజూరు కావాలని పేర్కొన్నారు.