జార్ఖండ్‌లో నవీపేట్ వాసి మృతి

జార్ఖండ్‌లో నవీపేట్ వాసి మృతి

NZB: నవీపేట్ మండలం అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి (20) జార్ఖండ్ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో పోస్టల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం మిత్రులతో కలిసి నదిలో స్నానానికి వెళ్లగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు.