'కార్గో ఎయిర్‌పోర్ట్‌కు ఒక్క సెంట్ భూమి కూడా ఇవ్వం'
SKLM: మందస మండలం పరిధిలో కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను రైతులు అంగీకరించడం లేదు. ఒక్క సెంట్ భూమి కూడా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఇవ్వమని ఉద్దానం రైతులు చెప్పారు. ఈ మేరకు మంగళవారం పలాస ఎమ్మెల్యే శిరీష రాంపురంలో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతులంతా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూమిని ఇవ్వమని అన్నారు.