VIDEO: ప్రత్తిపాడులో భారీ వర్షం

VIDEO: ప్రత్తిపాడులో భారీ వర్షం

GNTR: కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి, కుండపోత వర్షం పడింది. దీంతో రోడ్లు, పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఇప్పటికే పత్తి, సోయాబీన్ పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలు ఇంకా తడి ఆరకముందే మళ్లీ వర్షం కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.