పీ.గన్నవరంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

పీ.గన్నవరంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

కోనసీమ: పీ.గన్నవరం(మం) అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తమ క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం త్రీ రోడ్ జంక్షన్‌ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించారు. దేశానికి దశా దిశా నిర్దేశించిన మహానుభావుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నారు.