ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి

NGKL:పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదదాడిని ఖండిస్తూ మంగళవారం NGKLలో కవి గుడిపల్లి నిరంజన్ అధ్యక్షతన కవులు, రచయితలు నిరసన వ్యక్తంచేశారు. వారు మాట్లాడుతూ.. మతాల మధ్య సామరస్యపూరిత వాతావరణం నెలకొనాలని, లౌకిక ప్రజాస్వామ్య భారతరాజ్యాంగ విలువలు ప్రతిపౌరుడు పాటించాలని కవితలు, పాటల ద్వారా తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి దేశ ఐక్యతనుచాటాలని వారు పిలుపునిచ్చారు.