విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: ASI

NRML: విద్యార్థులు సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుందని ఏఎస్సై లక్ష్మణ్ అన్నారు. బుధవారం కుబీర్ లోని ZPHS పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరాలని, చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావొద్దని, ప్రతీ ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలన్నారు.