జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

GDWL: జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి ఆల్మట్టి గేట్లు తెరవడంతో ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న మొత్తం 40 గేట్లను ఎత్తివేసి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.