ఉరుసు ఉత్సవాల గోడపత్రికలు ఆవిష్కరించిన మంత్రి

ఉరుసు ఉత్సవాల గోడపత్రికలు ఆవిష్కరించిన మంత్రి

సత్యసాయి: పెనుకొండ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన హజరత్ బాబా ఫక్రుద్దీన్, బాబయ్య స్వామి 753వ ఉరుసు ఉత్సవాలకు మంత్రి సవితను మంగళవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెనుకొండ దర్గా పీఠాధిపతి తాజ్ బాబా మంత్రి సమక్షంలో ఉరుసు ఉత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఉరుసు ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.