VIDEO: 'సమ సమాజమే అంబేడ్కర్ కల'

VIDEO: 'సమ సమాజమే అంబేడ్కర్ కల'

VZM: కుల, మత, వర్గ భేదాలు లేని సమానత్వ సమాజాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ZP కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి శనివారం నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, దార్శనికుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు.