పులివెందులలో భారీగా పట్టుబడిన బంగారం

పులివెందులలో భారీగా పట్టుబడిన బంగారం

కడప: హైదరాబాద్ నుంచి పులివెందులకు ఫార్చునర్ వాహనంలో ఆరు సూట్ కేసుల్లో బంగారు నగలు తరలిస్తుండగా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె రింగ్ రోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నట్లు సేల్స్ టాక్స్ అధికారి జ్ఞానానంద రెడ్డి తెలిపారు. పట్టుబడిన బంగారానికి సంబంధించిన రసీదులు, బిల్లులను పరిశీలిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.