మానవత్వం చాటుకున్న డ్రైవర్లు
GDWL: అయిజ మాల పేటకు చెందిన ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ వీరేష్, సోమవారం రాత్రి గద్వాల రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. వీరేష్ మృతితో కుటుంబాన్ని పోషించే దిక్కు లేక ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న తోటి ప్రైవేట్ డ్రైవర్లు మానవత్వం చాటుకున్నారు. వారు తలా కొంత పోగుచేసి రూ. 25,000 జమ చేసి, మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.