సత్యదేవుని ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం
KKD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరిపై ఈనెల 26వ తేదీ నుంచి శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఇంఛార్జ్ ఈవో చక్రధరరావు గురువారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని కలిసి కల్యాణ ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.