గుడుంబాను పూర్తి స్థాయిలో నివారించండి..!

నిర్మల్: గుడుంబాను పూర్తి స్థాయిలో నివారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. గురువారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడుంబాను పూర్తి స్థాయిలో నివారించాలని అన్నారు.