'మహిళను వేధిస్తే చట్టపర చర్యలు తప్పవు'

SRD: పని ప్రదేశాలలో మహిళలను వేధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని షీటీం ఏఎస్సై తులసిరాం హెచ్చరించారు. ఖేడ్ పట్టణంలోని బసవేశ్వర చౌక్ వద్ద కూలీలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఆన్ లైన్ ఓటీపీలు చెప్పవద్దని, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో WPC చాంగు బాయి పాల్గొన్నారు.