150 మందికి కంటి శస్త్రచికిత్సలు విజయవంతం

150 మందికి కంటి శస్త్రచికిత్సలు విజయవంతం

అన్నమయ్య: రైల్వే కోడూరులో జరిగిన ఉచిత కంటి శిబిరంలో శస్త్రచికిత్స అవసరమైన 150 మందిని ముక్కా ఫౌండేషన్ తిరుపతి అరవిందా ఐ హాస్పిటల్స్‌కు తరలించింది. వైద్యులు విజయవంతంగా ఆపరేషన్‌లు పూర్తి చేశారు. రోగుల భద్రత కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కోడూరుకు సురక్షితంగా తీసుకువచ్చారు. ముక్కా రూపానంద రెడ్డి, వరలక్ష్మి రోగులను పరామర్శించి భోజన వసతి కల్పించారు.