తెనాలిలో చౌకగా ఉల్లిపాయలు..!

తెనాలిలో చౌకగా ఉల్లిపాయలు..!

GNTR: మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. వంటింట్లో నిత్యవసరమైన ఉల్లిపాయ ధరలు నెమ్మదిగా దిగి వస్తుండడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి రైతు బజార్లలో శుక్రవారం కేజీ ఉల్లి ధర రూ.10గా ఉంది. గత నెలలో కేజీ ఉల్లి రూ.30 దాకా పలికింది. రెండు రోజుల క్రితం వరకు కూడా రూ.17గా ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.10కి దిగి వచ్చాయి.