ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: బిజినపల్లి మండలం మహాదేవపేటలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతంగా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.