ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో మంచిర్యాల పెద్దపల్లికి రాకపోకల నిలిపివేత

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద గేట్ల ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నది పరిసర ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, చేపల వేటగాళ్లు, రైతులు జాగ్రత్తలు పాటించాలని ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి చేసింది. భారీ వరదల కారణంగా ప్రాజెక్ట్ పై నుంచి మంచిర్యాల-పెద్దపల్లికి రాకపోకలు నిలిపివేయబడ్డాయి.