కొత్త డీఎస్పీలు ఆదర్శంగా నిలవాలి: DGP
TG: HYD పోలీస్ అకాడమీలో 112 మందితో ఇదే అతి పెద్ద డీఎస్పీ బ్యాచ్ అని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. కొత్త డీఎస్పీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ.. కొత్త డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. 10 నెలల శిక్షణ కాలం చాలా కష్టంగా ఉంటుందని.. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవాలని తెలిపారు.