వేసవిలో రక్తదానం చేస్తున్నారా?
వేసవిలో రక్తదానం చేసే వారు కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. దానానికి ముందు, తర్వాత పుష్కలంగా నీరు, పండ్ల రసాలు తాగి హైడ్రేటెడ్‌గా ఉండండి. ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి గొడుగు, టోపీ వాడాలి. రక్తదానం చేశాక 20 నిమిషాల విశ్రాంతి తీసుకోండి. తక్షణ శక్తి కోసం ఖర్జూర, ఆకుకూరలు తినండి. దానం తర్వాత భారీ శారీరక శ్రమకు దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం.