VIDEO: ఎర్ర కాలువలో మహిళ మృతదేహం లభ్యం

E.G: అనపర్తి ఎర్ర కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. కాలువలో మృతదేహం ఉన్న సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశామన్నారు. మృతురాలి వయసు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై గోధుమ రంగు జాకెట్, కాషాయపు రంగు లంగా, పచ్చ రంగు గాజులు ఉన్నట్లు వివరించారు.