గ్యాస్ కొరత.. BRS నిరసన
HYD: పశ్చిమాసియా యుద్ధాల నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, పలువురు నేతలు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. కొరతలేదని చెప్తూనే.. హోటళ్లు, చిరు వ్యాపారులకు గ్యాస్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరాను పెంచేందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలన్నారు.