5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
PDPL: పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు ఇవాళ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సర్పంచ్ శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతి కార్యకలాపాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలిపి, బహుమతులు అందజేశారు.