జీడితోటలో అగ్ని ప్రమాదం..!
AKP: మాడుగుల మండలం కింతలి వల్లాపురం పంచాయతీ శరభన్నపాలెం కొండపోడు ప్రాంతంలోని జీడితోటలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించి సుమారు 10 ఎకరాల్లో జీడి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భారీ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు.