'ఎమ్మెల్యే సారూ.. బ్రిడ్జి పనులు చేపట్టండి'

'ఎమ్మెల్యే సారూ.. బ్రిడ్జి పనులు చేపట్టండి'

RR: కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి కాంట్రాక్టర్ మధ్యలో ఆపేశారు. దీంతో ప్రజలు రాకపోకల కోసం బ్రిడ్జి పక్కన ఉన్న పొలంలో నుంచి మట్టి రోడ్డును వేసుకున్నారు. మట్టిరోడ్డు వర్షాలతో దెబ్బతినడంతో రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. MLA వీర్లపల్లి శంకర్ స్పందించి తక్షణమే బ్రిడ్జి పనులు చేపట్టాలని కోరుతున్నారు.