డోన్‌లో వైసీపీ పత్రికా సమావేశం
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన అంశంపై పత్రికా సమావేశం సోమవారం జరిగింది. ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ నిర్ణయంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.