పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు

TPT: వెంకటగిరిలో రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుని సంబంధిత వారికి సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.