డయేరియా.. 20 మందికి పైగా అస్వస్థత
PLD: ఈపూరు (M) పోనుగోటివారిపాలెంలో వారం రోజులుగా అతిసార విజృంభిస్తోంది. వాంతులు, విరేచనాలతో సుమారు 20 మందికి పైగా గ్రామస్థులు అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది. బాధితులు నరసరావుపేట, ముప్పాళ్ల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు భావిస్తున్నారు.