సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 50 మందికి రూ.69,41,730ల ఆర్థికసాయం తాజాగా మంజూరైంది. ఈరోజు గొల్లపూడిలోని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కూటమి ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సత్వరం ఆర్థికసాయం అందుతుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.