అమ్మవారిని దర్శించుకున్న విశాఖ రేంజ్ ఐజీ

అమ్మవారిని దర్శించుకున్న విశాఖ రేంజ్ ఐజీ

అనకాపల్లి ​శ్రీ నూకాంబిక అమ్మవారిని విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ​అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.