నిర్మల్ జిల్లాలో గాలికుంటు టీకాల కార్యక్రమం
NRML: నిర్మల్ మండలం తల్వేద గ్రామంలో బుధవారం పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల 8వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. గేదెలు, ఆవులు, దూడలకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ వ్యాధి వైరస్ వల్ల వ్యాపించి పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని పశువైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.