భద్రతా పనుల కారణంగా రైళ్ల మార్పులు
VSP: ఆధునీకరణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్-కమ్-పవర్ బ్లాక్ కారణంగా ప్యాసింజర్ రైళ్లలో మార్పులు చేశారు. డిసెంబరు 16, 17, 18, 19, 20, 21, 26, 27వ తేదీల్లో నడిచే 58501 విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ డాంటేవాడ వద్ద ముగుస్తుంది. అలాగే డిసెంబరు 17, 18, 19, 20, 21, 22, 26, 27, 28 తేదీల్లో 58502 కిరండూల్–విశాఖ ప్యాసింజర్ కిరండూల్ బదులు డాంటేవాడ నుంచి ప్రారంభమవుతుంది.