'ఉపాధి కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి'
VSP: ఉపాధి హామీ వేతన దారులకు వేతన బకాయిలు చెల్లించాలని జెడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర సూచించారు. గురువారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన స్థాయి సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. డ్వామా ఏఓ రవీంద్ర మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాకు రూ.45 కోట్లు, అల్లూరి జిల్లాకు రూ.56 కోట్లు, విశాఖ జిల్లాకు రూ.6 కోట్లు వేతన బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.