VIDEO: బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
SRPT: చిలుకూరు మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్రాంచ్‌ను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ బ్యాంక్ ద్వారా స్థానిక రైతులకు పంట రుణాలు, విద్యా, బంగారం రుణాలు, సేవింగ్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లా సీఈవో శంకర్ రావు తెలిపారు. మండల ప్రజలు ఈ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.