ఎంట్రన్స్ టెస్ట్‌లో భాను రేఖకు రెండవ ర్యాంక్

E.G: ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో బిక్కవోలు మండలం కొమరిపాలానికి చెందిన తేతలి భానురేఖ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది అర్హత సాధించగా భాను రేఖ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు పొందారు. ఆమె రాయవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.