'అక్రమ మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు'
KMM: కల్లూరు మండలంలో అక్రమంగా మట్టి తోలకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ పులి సాంబశివుడు హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతి లేకుండా రోడ్లపై తిరిగే టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో ఉంటూ అక్రమార్కుల ఆట కట్టిస్తామని ఎలాంటి ఉల్లంఘనలనూ సహించబోమని స్పష్టం చేశారు.