చదువుకు దూరమవుతున్న అడవి బిడ్డలు?
ADB: జిల్లాలోని ఆ గ్రామంలో పాఠశాల లేక పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ఇంద్రవెల్లి మండలం వాల్గొండ జీపీ పరిధిలోని కైర్ గూడలో 10 ఏళ్ల క్రితం ప్రాథమిక పాఠశాల మూతపడింది. గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. వారు పక్క ఊరి పాఠశాలకు వెళ్లాలన్నా సరైన రోడ్డు, బస్ సౌకర్యం లేక చదువుకు దూరం అవుతున్నారు. దీంతో విద్యార్థుల బంగారు భవిత ఆగమవుతుంది. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.