మురికి కూపంగా కోనేరు..!
HNK: వేయి స్తంభాల ఆలయంలోని కోనేరు కలుషితమై దయనీయ స్థితికి చేరుకుంది. నాచు పెరిగి నీరు పచ్చగా మారగా, వ్యర్థాలు పేరుకుని దుర్గంధం వ్యాపిస్తోంది. కోనేరులోని తాబేళ్లు కూడా ఈ నీటిలో ఉండలేక ఒడ్డుకు చేరుతున్నాయి. పరిస్థితిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే శుభ్రపరిచి కోనేటిని స్వచ్ఛంగా మార్చాలని అధికారులను కోరుతున్నారు.