రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

NLR: పొదలకూరు మెయిన్ రోడ్డుపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చేజర్ల మండలం చిత్తలూరుకు చెందిన రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతను నెల్లూరు నుంచి బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.