కుట్టు మిషన్ల నిధుల్లో రూ.257కోట్ల భారీ అవినీతి

KRNL: బీసీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేసేందుకు కేటాయించిన రూ.257కోట్ల నిధుల్లో భారీ అవినీతి జరిగిందని మాజీ KDCC బ్యాంక్ చైర్‌పర్సన్ ఎస్వీ విజయ మనోహరి సోమవారం ఆరోపించారు. ఈ నిధుల్లో రూ.167 కోట్లను దారి మళ్లించినట్లు ఆమె విమర్శించారు. టెండర్ దశ నుంచే అవినీతి జరిగి, దోపిడీదారులకు నిధులు చేరినట్లు ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో వైసీపీ రాఘవేంద్ర, తదితరులు ఉన్నారు.